amp pages | Sakshi

ఆర్‌బీఐ ఆర్డర్‌ : ఈ నోట్లు ఏటీఎంలలో పెట్టండి

Published on Thu, 01/04/2018 - 08:47

ముంబై  : పెద్ద నోట్ల రద్దు తర్వాత చిల్లర కొరతను తగ్గించడానికి రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా రూ.200 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నోట్లను ప్రస్తుతం బ్యాంకుల ద్వారా మాత్రమే అందిస్తున్నారు. అయితే త్వరలోనే ఈ నోట్లు ఏటీఎంలలోకి రానున్నాయి. ప్రజలకు రూ.200 డినామినేషన్‌ నోటును అందుబాటులోకి తీసుకురావడానికి  ఏటీఎంలను రీక్యాలిబరేట్‌ చేయాలని ఆర్‌బీఐ, బ్యాంకులను ఆదేశించింది. తక్కువ డినామినేషన్‌ కరెన్సీ సరఫరాను ప్రోత్సహించేందుకు త్వరలో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని పేర్కొంది. రెగ్యులేటరీ ఆదేశాలను అమల్లోకి తీసుకురావడానికి బ్యాంకింగ్‌ పరిశ్రమ దాదాపు రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు.  బ్యాంకులు, ఏటీఏం తయారీదారులు ఎంత వీలైతే అంత త్వరగా రూ.200 నోట్లను ఏటీఎంల ద్వారా అందించడం ప్రారంభించాలని  ఆర్‌బీఐ ఆదేశించినట్టు ఓ బ్యాంకరు చెప్పారు. 

ఈ ఆదేశాలను పూర్తిగా అమలు చేయడానికి 5 నుంచి 6 నెలల సమయం పడుతుందని తెలిసింది. ఇప్పటికే ఏటీఎంల రీక్యాలిబరేట్‌ ప్రారంభమైనట్టు హిటాచి పేమెంట్‌ సర్వీసెస్‌ ఎండీ లోని ఆంటోని చెప్పారు. దీనికి ఖర్చు అధికంగానే ఉండనుందని, కానీ  ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు పోనున్నట్టు చెప్పారు. రూ.200 నోట్లను ఎక్కువగా అందించడం కోసం ఆర్‌బీఐ కూడా రూ.2000 నోట్ల ప్రింటింగ్‌ను ఆపివేసింది.ఈ విషయంపై ఆర్‌బీఐ ఇంకా స్పందించలేదు. పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దు తర్వాత సెంట్రల్‌ బ్యాంకు ఎక్కువగా రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది. దీంతో చిల్లర నోట్ల కొరత ఏర్పడింది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే నగదు విలువ కూడా పెరిగినట్టు  తెలిసింది. 2016 సెప్టెంబర్‌లో రూ.2.22 లక్షల కోట్ల నగదును ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకుంటే, 2017 సెప్టెంబర్‌లో రూ.2.44 లక్షల కోట్ల నగదు విత్‌డ్రా అయింది. 

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)